నిర్మాత ఆత్మహత్య....ఆపై ప్రియురాలు బలవన్మరణం!

<< Back

కొచ్చి: మళయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత అజయ్ క్రిష్ణన్ ఏప్రిల్ 25న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన వెంటనే మరో విషాదం కూడా చోటు చేసుకుంది. అజయ్ క్రిష్ణన్ ప్రియురాలు వినితా నాయర్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అజయ్ క్రిష్ణన్ మృతిని తట్టుకోలేక వినీతా నాయర్ మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంచన్ ఎస్ఐ సతీష్ కుమార్ ఈ కేసు విషయమై పోలీసులతో మాట్లాడుతూ....వినీత నాయర్ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉందని తెలిపారు.

బెంగుళూరులో ఫ్యాషన్ డిజైనిగ్ కోర్సు పూర్తి చేసిన వినీతా నాయర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంతో తన ప్రియుడు అజయ్ కృష్ణన్ మరణించడంతో డిప్రెషన్ కు గురైన ఆమె ఆయన లేని జీవితం తనకు వద్దని భావించి బలవన్మరణానికి పాల్పడ్డారు.

అజయ్ కృష్ణన్ 'అవరుదె రవుగల్' అనే మళయాళ చిత్రానికి నిర్మాత. ఆర్థిక సమస్యల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

Related News