పొగరాయుళ్లకు కష్టకాలం.. ప్యాక్ సిగరెట్ల ధర 2300

<< Back

ఒక ప్యాక్ సిగరెట్ల ధర రూ.2300. గుప్పు గుప్పుమని పొగ ఊదే పొగరాయుళ్ళకు ఇది మింగుడుపడని విషయమే. అయితే ఇది మన దేశంలో కాదు. ప్రపంచంలోనే అధిక ధరలకి సిగరెట్లను విక్రయించే ఆస్ట్రేలియాలో సిగరెట్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. అక్కడి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం రాబోయే నాలుగేళ్లలో 25 ఒక సిగరెట్లు ఉండే ఒక ప్యాకెట్ ధర రూ.2300 కు చేరుకోనుందని ఆస్ట్రేలియా మార్కెట్ వర్గాల సమాచారం.

ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా.. ఈ ఏడాది నుంచి వచ్చే నాలుగేళ్ల పాటు పొగాకుపై ఎక్సైజ్ సుంకం 12.5 శాతం వరకు పెరగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అమలవుతున్న సిగరెట్ల ధరలు పరిశీలిస్తే.. మెల్ బోర్న్ లో ఒక ప్యాక్ మార్ల్ బోర్ సిగరెట్ ప్యాక్ ధర దాదాపుగా రూ.1270. ఇదే బ్రాండ్ సిగరెట్ల ధర సిడ్నీలో రూ.1165 కావడం గమనార్హం.

ఇక ఇదే మార్ల్ బోర్ సిగరెట్ ప్యాక్ ను పారిస్ లో రూ.524, కెనడాలోని అట్టావాలో రూ.599, లండన్ లో రూ.920, న్యూయార్క్ లో రూ.895 లకు విక్రయిస్తున్నారు. ఆస్ట్రేలియాలో సిగరెట్ ధరల పెంపుపై స్పందించిన ఇంపీరియల్ అమెరికా టొబాకో కార్పొరేట్ లీగల్ అధినేత అండ్రీవ్ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఆస్ట్రేలియాలోనే పొగాకుపై అధిక ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తున్నట్టుగా తెలిపారు.

Related News