రాజమౌళి సమాధానం: బాహుబలి తర్వాత మరిన్ని భారీ ప్రాజెక్టులు!

<< Back

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారత దేశం గర్వించదగ్గ చిత్రం 'బాహుబలి-ది బిగినింగ్'. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతదేశ ప్రజల మనసు దోచింది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా ఉండటంతో దేశం గర్వించదగ్గ సినిమాగా నిలిచింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఈ చిత్రానికి అవార్డుల మీద అవార్డుల వస్తూనే ఉన్నాయి.

'బాహుబలి' చిత్రానికి 63వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. బెస్ట్ స్పెషల్ ఎపెక్ట్స్ విభాగంలోనూ ఈ చిత్రానికి అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకునేందుకు‌గాను ఢిల్లీ వచ్చిన రాజమౌళి అక్కడ మీడియా అడిగిన ప్రశ్నకుల స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.

మీరు హాలీవుడ్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు? అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాజమౌళి స్పందస్తూ....'హాలీవుడ్ సినిమా చేసే ఆలోచన ఏమీ లేదు' అని స్పష్టమైన వివరణ ఇచ్చారు.

'మా తాత చిన్న తనంలో చెప్పిన కథలతో నేను ఎంతో ఇన్‌స్పైర్ అయ్యాను. ఆయన చెప్పిక కథలన్నీ భారతీయ చరిత్ర, గొప్పదనం గురించే. ఆపుడు నేను దర్శకుడిని అవుతానని ఊహించలేదు. ఆ కథలు మాత్రం నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తాను 'బాహుబలి' పార్ట్-2 తెరకెక్కిస్తున్నాను' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇండియాకు సంబంధించిన ఎన్నో స్టోరీలను తెరకెక్కించాలని ఉంది. అశోకుడు, అక్బర్, మహారాణా ప్రతాప్ లాంటి వారి కథలను చేయాలనే కోరిక ఉంది అని రాజమౌళి తన మనసులోని మాటను తేటతెల్లం చేసారు. దీన్ని బట్టి బాహుబలి తర్వాత రాజమౌళి నుండి మరిన్ని నేషనల్ వైడ్ భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయన్నమాట.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి పార్ట్-2 పనులు శరవేగంగా సాగుతున్నాయి. 'బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో రాబోతున్న ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News