సంస్కృతం పేరెత్తి సెటైర్ల పాలైన స్మృతీ ఇరానీ..!

<< Back

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయి. గతంలో సంస్కత భాషను యూనివర్సిటీలన్నింటిలోను విధిగా నేర్పాలనే ప్రతిపాదన తీసుకొచ్చి విమర్శల పాలైన స్మృతీ ఇరానీ, తాజాగా శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన అనేక విషయాల గురించి అధ్యయనం చేయడానికి సంస్కృతం ఎంతగానో ఉపయోగడుతుందన్నారు.

కాబట్టి దేశంలో ఉన్న అన్ని ఐఐటీలల్లో సంస్కృత భాషను విధిగా బోధించాలని విజ్ఞప్తి చేసినట్టుగా చెప్పుకొచ్చారు. స్మృతీ ఇరానీ లోక్‌సభలో చేసిన ఈ ప్రకటనపై సోషల్‌ మీడియాలో నెటిజన్స్ సెటైర్లు విసురుతున్నారు.

అందులో మచ్చుకు కొన్ని..

హెచ్‌.ఆర్‌.డీ మినిస్ట్రీ అంటే.. 'హిందూ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ అనుకుంటున్నట్లున్నారని సెటైర్ వేశారు . అలాగే ఇంజనీరింగ్‌ అంటే గ్రీక్, లాటిన్‌ అని ట్విట్టర్‌ ఇండియాను సంస్కృతంలో రాసేవిధంగా అభివద్ధి చేయాలని ఐఐటీ విద్యార్థులను కోరాలని సలహా ఇచ్చారు కొందరు. మరికొందరు స్మృతీ ఇరానీ నవ్వుతున్న ఫోటో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. న్యూటన్ చెప్పిన చలన సూత్రాలను ఎలా రాయాలో తెలియక తికమకపడుతున్న ఐఐటీ విద్యార్థులను చూసి పగలబడి నవ్వుతున్నారని కామెంట్ చేశారు.

ఇంకొంతమంది ఈవిధంగా కామెంట్ చేశారు..

'మూర్ఖంగా ఆలోచించేవాళ్లకు స్మృతీ ఇరానీ ముందుచూపు ఎలా తెలుస్తుంది..! టైమ్‌ మిషన్‌ ద్వారా ప్రాచీనకాలంలోకి వెళ్లినప్పుడు సంస్కృత భాష పనికొస్తుందన్నమాట. థర్మో డైనమిక్స్‌ను సంస్కృతంలో ఏమనాలి?. హెచ్‌2ఓ ఫార్ములాను ఇలా రాయాలేమో..! హైడ్రోవరణం ద్వి ఆక్సీవరణం....సీప్లస్‌ప్లస్, జావా, సోల్, పైథాన్, జావా స్క్రిప్టు లాంటి కంప్యూటర్‌ భాషలను ఇంకే భాష ఎదుర్కోగలదు ఒక్క సంస్కృతం తప్ప. ఐఐటీలో సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం గురించి ఇప్పుడెవరికి అర్థం కాదు. అది నేర్చుకుంటే తప్ప తెలియదు.

Related News