లోఫర్ లాస్: డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై డిస్ట్రిబ్యూటర్ల దాడి

<< Back

హైదరాబాద్: డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌పై పలువురు డిస్ట్రిబ్యూటర్లు దాడి చేశారు. గతంలో పూరి దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్' సినిమాతో నష్టపోయామంటూ అభిషేక్, ముత్యాలు, సుధీర్ అనే ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు పూరీ ఇంటి వద్ద రభస సృష్టించారు.

పూరీ ఆఫీస్‌పైనా కూడా దాడి చేశారు. రాబోయే కాలంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించే సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తమకే ఇవ్వాలని వారు గొడవ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేసిన విషయంపై పూరి జగన్నాథ్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వారిపై 323, 506, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లోఫర్ సినిమాలో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. హీరోయిన్‌గా దిశా పటానీ నటించింది. ఈ సినిమా నిరుడు డిసెంబర్‌లో భారీ అంచనాలతో విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టింది.

Related News