నా కొడుకు క్రమశిక్షణ గలవాడు: రాష్ డ్రైవింగ్‌పై సుజన (పిక్చర్స్)

<< Back

హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి తనయుడు శ్రీకార్తిక్ (25) శుక్రవారం అర్ధరాత్రి అతివేగంగా వాహనం నడుపుతుండగా ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని పైన శనివారం నాడు కేసు నమోదయింది. దీనిపై సుజనా చౌదరి స్పందించారు.

తన కొడుకు శ్రీకార్తీక్ చాలా క్రమశిక్షణగా ఉంటాడని, అలాగే పెరిగాడని సుజనా చౌదరి చెప్పారు. అతని పైన అమెరికాలే లేదా భారత్‌లో ఎక్కడా కేసులు లేవని చెప్పారు. తన కొడుకు, అతని స్నేహితులు రాత్రి పదిన్నర గంటల సమయంలో జాయ్ రైడ్‌కు వెళ్లారని, రాష్ డ్రైవింగ్ కేసు సరికాదన్నారు.

కాగా, శ్రీకార్తీక్ పెళ్లి ఈ నెల 23వ తేదీన ఉంది. ఇందుకోసం అతను ఇటీవలే అమెరికా నుంచి భారత్ వచ్చాడు. అమెరికాలో అతని స్టడీస్ పూర్తయ్యాయి. సుజనా తనయుడుశ్రీకార్తిక్ శుక్రవారం అర్ధరాత్రి అతివేగంగా వాహనం నడుపుతుండగా ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Related News